తెలంగాణ

telangana

ETV Bharat / state

రహ్మత్‌ నగర్‌లో అనుమానాస్పదంగా మహిళ మృతి - Woman Suicide in Jublihills

హైదరాబాద్ రహ్మత్​నగర్​లో దారుణం చోటుచేసుకుంది. భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి స్వాతి అనే మహిళ దుర్మారణం చెందింది.

రహ్మత్‌ నగర్‌లో అనుమానాస్పదంగా మహిళ మృతి

By

Published : May 27, 2019, 11:17 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని రహ్మత్‌ నగర్‌లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. తానుంటున్న భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది. మృతురాలు సామర్లకోటకు చెందిన స్వాతిగా పోలీసులు గుర్తించారు. ఆమెది ఆత్మహత్యనా లేక ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయిందా అనేది దర్యాప్తులో తేలనుందని పేర్కొన్నారు. మృతురాలి ఇద్దరు కుమారులు మాత్రం తమ తల్లి భవనం నుంచి కిందపడి చనిపోయిందని ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details