దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని... ఓ మహిళ రథయాత్ర చేపట్టింది. తమిళనాడుకు చెందిన రాజ్యలక్ష్మి మందా తాను స్వతహాగా తయారు చేయించిన 613 కిలోల భారీ గంటతో రామేశ్వరం నుంచి అయోధ్య రామజన్మభూమి వరకు రథయాత్రకు శ్రీకారం చుట్టింది.
10 రాష్ట్రాల మీదుగా 21రోజుల్లో 4,552కిలోమీటర్లు తానే డీసీఎంను డ్రైవ్ చేసుకుంటూ తన గమ్యస్థానానికి చేరుకొనుంది. లీగల్ రైట్స్ ఇండియా ఆధ్వర్యంలో... రాజ్యలక్ష్మి మందా చేపట్టిన రథయాత్ర ఈ రోజు హైదరాబాద్కు చేరుకుంది.