తెలంగాణ

telangana

ETV Bharat / state

Woman Raped by Canteen Employee at ESI Hospital : సనత్​నగర్​ ఈఎస్​ఐ ఆస్పత్రిలో దారుణం.. రోగి సోదరిపై అత్యాచారం - ఈఎస్​ఐ ఆసుపత్రి ఎర్రగడ్డ

Woman Raped by Canteen Employee at ESI Hospital Hyderabad : మహిళలు, చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. రోగి సహాయం కోసం వచ్చిన అతని సోదరిపై ఆసుపత్రి క్యాంటీన్​లో పని చేసే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది.

Lady Rape at ESI Hospital Hyderabad
Lady Rape

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2023, 11:31 AM IST

Woman Raped by Canteen Employee at ESI Hospital Hyderabad :సమాజంలో బాలికలు, మహిళలపై ఆకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేదు.. ఆడపిల్ల అయితే చాలనుకుని మీద పడిపోతున్నారు కొందరు వ్యక్తులు. వావి-వరసలు మరచి అఘాయిత్యాలకుతెగబడుతున్న వారు మరికొందరు. కాపాడాల్సిన వారే కాటేస్తున్న ఘటనలూ చూస్తున్నాం. తమ కామ వాంఛతో క్షణికావేశంలో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు.

Meerpet Minor Girl Gang Rape Case : బాలికపై సామూహిక అత్యాచారం.. మెడపై కత్తి పెట్టి మరీ ఘాతుకం

Rape on Lady at Sanathnagar ESI Hospital :ప్రస్తుత కాలంలో ఆడవారు అర్ధరాత్రే కాదు.. పట్టపగలూ ఒంటరిగా బయటకు రావాలన్నా బయపడే పరిస్థితి నెలకొంది. మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. నిందితులను ఎంత కఠినంగా శిక్షించినా.. కీచకుల అఘాయిత్యాలు (Atrocities) ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్​ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. సోదరుడికి చికిత్స చేయించడానికి సహాయకురాలిగా వచ్చిన యువతిపై ఈఎస్‌ఐ ఆసుపత్రి(ESI Hospital)లోని క్యాంటీన్‌ సిబ్బంది(Canteen Staff) ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఎస్సార్​నగర్ పోలీస్ స్టేషన్​ (SR Nagar Police Station) పరిధిలో చోటుచేసుకుంది.

Brother Raped Minor Sister in Maharashtra : చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన అన్న.. గర్భం దాల్చిన బాలిక.. ఆఖరికి..

ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పీవీ రామప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఓ యువతి (19) సోదరుడు జారి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి సోదరి గతంలో సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో (ESI Hospital Sanatnagar) చికిత్స చేయించింది. బాధితుడికి ఇటీవల నొప్పి తిరగబెట్టడంతో ఈ నెల 6వ తేదీన సోదరుడిని తీసుకొని మరలా ఆసుపత్రికి వచ్చింది. సోదరుడు ఇన్‌పేషంట్‌ (Inpatient)గా చేరడంతో యవతి కూడా అక్కడే ఉంటోంది.

Woman Rape in ESI Hospital Hyderabad :శుక్రవారం రాత్రి సోదరుడికి ఆహారం తీసుకురావడానికి ఆరో అంతస్తు నుంచి యువతి కిందికి వచ్చింది. తిరిగి వెళ్లబోతుంటే.. ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు(Security Guard) ఆమెకు తారసపడి అక్కడి క్యాంటీన్‌లో పని చేసే షాదాబ్‌ (25)ను పరిచయం చేశాడు. ఏదైనా సాయం కావాలంటే అతడిని సంప్రదించాలని సూచించాడు. ఆమె తిరిగి లిఫ్ట్‌లో వెళ్తుండగా.. షాదాబ్‌ ఆమెను అనుసరించి బలవంతంగా రెండో అంతస్తులోని చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం రక్త పరీక్షలు(Blood Tests) చేసే గదిలో మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి సోదరుడికి ఫోన్‌ చేయగా.. అతను రెండో అంతస్తుకు చేరుకొని గట్టిగా కేకలు వేశాడు. దీంతో నిందితుడు పారిపోయాడు. ఆసుపత్రి అధికారులు(Hospital Officials) దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. నిందితుడు షాదాబ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

College Student Kidnapped and Raped : విద్యార్థిని కిడ్నాప్, రేప్.. నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులు

8 Year Old Girl Kidnapped and Raped : 8ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లి..

ABOUT THE AUTHOR

...view details