హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి కైలాశ్నగర్ కాలనీలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన గృహిణి సుజితకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
గ్యాస్ సిలిండర్ లీక్... మహిళకు గాయాలు - telangana news
హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకైంది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

గ్యాస్ సిలిండర్ లీకై... మహిళకు గాయాలు
గాయపడిన సుజితను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:భర్త వైద్యం కోసం.. కొడుకునే తాకట్టు పెట్టిన తల్లి