తెలంగాణ

telangana

ETV Bharat / state

తానూ ఓ సీఐ బంధువునని మీర్‌పేట్‌లో మహిళ హల్​చల్​ - Women Halchal in Meerpet

Woman Halchal in Meerpet: మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ హంగామా సృష్టించింది. సదరు మహిళ ప్రయాణిస్తున్న కారును వేరొక కారు ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అతనిపై దాడికి దిగింది. అంతే కాకుండా తానూ ఓ సీఐ బంధువునని హల్​చల్ చేసింది.

vWoman Halchal in Meerpet
Woman Halchal in Meerpet

By

Published : Oct 17, 2022, 9:18 AM IST

Woman Halchal in Meerpet: కూకట్‌పల్లి సీఐ చంద్రయ్య తన బంధువు అంటూ ఓ మహిళ రోడ్డుపై హల్​చల్ చేసింది. మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టీకేఆర్​ కమాన్‌ వద్ద ఘటన జరిగింది. సదరు మహిళ ప్రయాణిస్తున్న కారును.. మరో కారులో ఉన్న వ్యక్తి ఢీ కొన్నాడు. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ వాగ్వాదానికి దిగి అతనిపై దాడికి పాల్పడింది. ఈ కారణంగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.

మహిళ ప్రయాణిస్తున్న కారుపై పోలీసు అని రాసి ఉన్న స్టిక్కర్‌ ఉన్నట్టు స్థానికులు తెలిసారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్​ను పునరుద్ధరించారు. ఇరువురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

తానూ ఓ సీఐ బంధువునని.. మీర్‌పేట్‌లో మహిళ హల్​చల్​!

ABOUT THE AUTHOR

...view details