తెలంగాణ

telangana

ETV Bharat / state

5.2 Kg Male Baby Born in Ananthapuram : 5.2 కిలోల బాల భీముడు జననం.. తల్లీబిడ్డ క్షేమం - baby weighing 5 kg 200 grams in Anantapur district

Woman Gave Birth to 5.2 Kg Male Baby : సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు బరువు 2.5 కిలోల నుంచి 3.5 వరకు ఉంటుంది. అందుకు భిన్నంగా ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ మహిళ 5.2 కిలోల బాలుడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

5.2 Kg Male Baby Born in Ananthapuram
5.2 Kg Male Baby Born in Ananthapuram

By

Published : Jun 20, 2023, 1:47 PM IST

Woman Gave Birth to 5.2 KG Baby Boy: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఏకంగా 5.2 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. ఈమెకు గతంలో కూడా ఎక్కువ బరువున్న శిశువులే పుట్టారు. ఈ సారి గత రెండు కాన్పుల కంటే ఎక్కువ బరువున్న శిశువు జన్మించాడు.

సాధార‌ణంగా పుట్టిన వెంట‌నే పిల్ల‌లు 2.5 నుంచి 3.5 కిలోల వ‌ర‌కు బ‌రువు ఉంటారు. 3 - 3.5 కిలోల‌ను స‌గ‌టు బ‌రువుగా చెబుతుంటారు. కానీ అనంత‌పురం జిల్లాలో 5.2 కిలోల బ‌రువున్న శిశువు జ‌న్మించాడు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను అనంత‌పురం జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి చెందిన వైద్యులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన షాబానా ఖానమ్‌కు​ 5.2 కేజీల బరువుతో శిశువు జన్మించాడని పేర్కొన్నారు.

Strange incident: భార్య నల్లపూసల గొలుసు మింగేసిన భర్త.. ఆపరేషన్ చేయకుండానే వైద్యం

షాబానాఖానమ్.. భర్త ఆయుబ్​తో కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. షాబానా గత నెల 30వ తేదీన ఆసుపత్రిలో చేరింది. స్కానింగ్​లో శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో పాటు ఉమ్మనీరు అధికంగా ఉన్నట్లు గుర్తించి, రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. దీంతో చేరిన రోజునే సిజేరియన్ చేసి శిశువును బయటకు తీసినట్లు తెలిపారు. మామూలుగా 5 సెంటీమీట‌ర్ల స్థాయిలో ఉండే ఉమ్మ‌నీరు ఏకంగా 28 సెంటీమీట‌ర్లు ఉంది. బాగా హైరిస్క్ కేసు కావ‌డంతో వెంట‌నే చేర్చుకుని వైద్య ప‌రీక్ష‌లు చేశామన్నారు.

షాబానాకు ఉమ్మ‌ నీరు ఎక్కువ ఉండ‌టంతో పాటు లోప‌ల శిశువు బ‌రువు కూడా ఎక్కువ కావ‌డంతో మ‌త్తు ఇవ్వ‌డానికి కూడా ఇబ్బంది అయ్యిందన్నారు. అయినా అవ‌స‌ర‌మైన వైద్య పరీక్ష‌ల‌న్నీ చేశామన్నారు. ఐదో నెల త‌ర్వాత ఆమెకు ఒక్క స్కాన్ కూడా చేయలేదని, దీంతో వెంట‌నే స్కాన్ చేసి చూస్తే విష‌యం తెలిసిందన్నారు.

Different Snakes: ఉప్పుటేరులో వింత పాములు.. ఒకటీ రెండూ కాదు ఏకంగా

అంత‌కుముందే ఈమెకు ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. వాళ్లు కూడా పుట్టిన‌ప్పుడు బ‌రువు ఎక్కువ‌గానే ఉండ‌టంతో అప్పుడూ సిజేరియ‌న్లు చేశారన్నారు. మొద‌టి సారి గ‌ర్భం దాల్చిన‌ప్పుడే మ‌హిళ‌కు మ‌ధుమేహం, ర‌క్త‌పోటు మొద‌ల‌య్యాయన్నారు. ఇప్పుడు ప్ర‌స‌వానికి వ‌చ్చేస‌రికి కూడా మ‌ధుమేహం, ర‌క్త‌పోటు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్నారు. ఈ కేసులో ఉన్న క్లిష్ట‌త‌ దృష్ట్యా త‌ప్ప‌నిస‌రిగా సిజేరియ‌న్ చేయాల్సి వ‌చ్చిందన్నారు.

బాబును ముందు జాగ్ర‌త్త‌గా 10 రోజుల పాటు ఎన్ఐసీయూలో ఉంచి ప‌రీక్షించామని వైద్యులు తెలిపారు. ఎటువంటి స‌మ‌స్య‌లు లేక‌పోవ‌డంతో డిశ్చార్జీ చేసినట్లు తెలిపారు. డిశ్చార్జీ స‌మ‌యానికి త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, బాబుకు భ‌విష్య‌త్తులో ఊబ‌కాయం, మ‌ధుమేహం వ‌చ్చే అవ‌కాశం ఉంటుందన్నారు. అందువ‌ల్ల జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించుకోవాల‌ని వారికి చెప్పినట్లు వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి..

ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ప్రసవం.. 5.8 కిలోలతో బాల భీముడు జననం

విజయనగరంలో బాల భీముడు... భలే ఉన్నాడు..!

ABOUT THE AUTHOR

...view details