వెలుగులోకి వస్తున్న అక్రమాలు
"15రోజుల్లో ఛార్జిషీట్ వేస్తాం" - dcp srinivas
జయరాం హత్యకేసులో నిందితుల డొంక కదులుతోంది. దర్యాప్తు జరిపేకొద్దీ..పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో సహాయ నటుడు సూర్య, అతని స్నేహితుడు కిశోర్, స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 15 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు.
జయరాం హత్యకేసులో వెలుగులోకి వస్తున్న అక్రమాలు
డిసెంబర్ 2017లో ప్రగతి రిసార్ట్స్ ఎండీ కుటుంబాన్ని భయపెట్టి, కొంత భూమిని రాయించుకున్నట్లుడీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పెద్దవాళ్లతో సంబంధాలు ఉన్నాయనే భయంతో వారు రాకేశ్ రెడ్డిపై ఫిర్యాదు చేయలేదన్నారు. ఆ భూమిని భూదేవి అనే పేరు మీద రిజిస్టర్ చేయించినట్లు పేర్కొన్నారు.దానిలో కొంత భాగాన్ని అంజిరెడ్డికి విక్రయించాలనుకున్నాడని అన్నారు. ఆ పత్రాలు అంజిరెడ్డి వద్దే ఉన్నాయని డీసీపీ తెలిపారు.
ఇవీ చూడండి:రాకేశ్‌రెడ్డితో పరిచయమా? ఎంతకాలంగా
Last Updated : Mar 15, 2019, 1:02 AM IST