కరోనాతో ఇప్పుడు అంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. బయటకెళ్లే పరిస్థితి లేదు. ఇంటిల్లిపాదికి నిత్యం కొత్త రుచులు కావాలి. పోనీ టైం పాస్ కోసం డిజిటల్ మీడియాని ఆశ్రయిద్దామంటే... ఓటీటీల్లోనూ కంటెంట్ తగ్గింది. ఫిట్నెస్ మాట సరే సరి. తాగటానికి చుక్కా లేదు... తినటానికి ముక్కా లేదు అనే వారు కోకొల్లలు. మరి ఇలాంటి పరిస్థితులు వ్యక్తుల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతోందనే వివరాలపై ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్ డా. ఉమాశంకర్తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
కుటుంబం తోడుంటే మద్యపాన వ్యసనం దూరం : డా. ఉమాశంకర్ - హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం
మద్యం సేవించే అలవాటు ఉన్న వారికి కుటుంబ సభ్యులు సహకరిస్తే వ్యసనం బారి నుంచి బయట పడవచ్చని... ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్ డా. ఉమాశంకర్ తెలిపారు. మద్యానికి అలవాటు పడ్డ వారిని తాగుబోతులుగా చూడకుండా... వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలని చెప్పారు.
కుటుంబం తోడుంటే మద్యపాన వ్యసనం దూరం : డా. ఉమాశంకర్