తెలంగాణ

telangana

ETV Bharat / state

చిరు ధాన్యాలతో... భారీ గణనాథుడు! - పర్యావరణ పరిరక్షణ

వినాయక చవితి వచ్చిందంటే చాలు... రకరకాల రంగులతో తయారుచేసిన విగ్రహాలు మన కళ్లముందు కదలాడుతుంటాయి. పర్యావరణానికి చేటు చేస్తాయని తెలిసినా... ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​తో చేసిన విగ్రహాలనే ప్రస్తుతం ఎక్కువగా పూజిస్తున్నారు. కానీ ఓ వ్యక్తి పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని విధంగా గత తొమ్మిదేళ్లుగా విభిన్న ఆకృతులతో గణనాథుడిని పూజిస్తూ... నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

చిరు ధాన్యాలతో...భారీ గణనాథుడు!

By

Published : Sep 2, 2019, 10:05 PM IST

కడప పట్టణంలోని ఊరగాయల వీధికి చెందిన రాము ఓ చిరు వ్యాపారి. అయితేనేం...పర్యావరణ పరిరక్షణకు తనవంతు సహాయ సహకారాలు అందించి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గత తొమ్మిదేళ్లుగా పర్యావరణానికి హాని చేయని విధంగా విభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి పూజిస్తున్నారు. గతంలో దూది, సిమ్​కార్డు, బూంది తదితర వాటితో విగ్రహాలను ఏర్పాటు చేసి గుర్తింపు చాటుకున్నారు. ఈసారి పూర్తిగా చిరు ధాన్యాలైన రాగులు, జొన్నలు, ఉలవలు వంటి వాటిని ఉపయోగించి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ గణనాథుని తయారీకి 40 వేలు ఖర్చు కాగా.. నాలుగు నెలల సమయం పట్టిందని రాము తెలిపారు. కాలుష్య నివారణ కోసమే ఈ తరహా విగ్రహాలను తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు.

చిరు ధాన్యాలతో...భారీ గణనాథుడు!

ABOUT THE AUTHOR

...view details