నగరంలో ఒకవైపు వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్తుంటే... మరోవైపు శివారు ప్రాంతాల నుంచి స్థానికులు భవన నిర్మాణ పనుల కోసం వస్తున్నారు. అయితే వలస కూలీలు మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. కానీ స్థానికంగా కూలీ పనులకు వెళ్లే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులకు వెళ్లడం ఈటీవీ భారత్ కెమెరా బంధించింది. అందులోనూ చిన్న పిల్లలను పట్టుకుని కూలీ పనులకు వెళ్తున్నారు.
వారు ఇంటికి... వీరు పనికి.. - telangana lockdown latest news
పిల్లలు రెండు పూటల అన్నం తినాలంటే... పనికి పోవాల్సిందే. లాక్ డౌన్ కారణంగా పనులు ఆగిపోయాయి. ఒకవైపు వలసకూలీలు స్వరాష్ట్రాలకు చేరుకుంటుంటే... నగర శివారులోని మహిళలు పనుల కోసం వెళ్తున్నారు. మాస్కులు లేకుండా కూలీ పనులకు పోతున్నారు.
బతుకు భారం... పనికై పయనం