నిరంతర శిక్షణ, చట్టాలపై సంపూర్ణ అవగాహనతోనే సమర్ధమైన పోలీసింగ్ సాధ్యమని నల్సార్ విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య ఫైజన్ ముస్తఫా అన్నారు. "రాజ్యాంగం - మానవ హక్కులు - పోలీసింగ్" అనే అంశంపై రాష్ట్ర పోలీస్ అకాడమీలో సదస్సు నిర్వహించారు. పోలీసు సిబ్బందితోపాటు, ఇన్స్‌స్పెక్టర్, ఎస్సైలకు నిరంతరం మానవ హక్కులు, న్యాయ, చట్ట పరమైన అంశాలపై శిక్షణ ఇవ్వాలని ఆచార్య ఫైజన్ ముస్తఫా సూచించారు.
'పోలీసు సిబ్బందితోపాటు సీఐ, ఎస్సైలకూ శిక్షణివ్వాలి' - తెలంగాణా రాష్ట్ర పోలీస్ అకాడమీ
"రాజ్యాంగం - మానవ హక్కులు - పోలీసింగ్" అనే అంశంపై హైదరాబాద్‌లోని తెలంగాణా రాష్ట్ర పోలీస్ అకాడమీలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్సార్ విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య ఫైజన్ ముస్తఫాతోపాటు.. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీసు సిబ్బంది నిరంతరం మానవ హక్కులు, న్యాయ, చట్ట పరమైన అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు.
పోలీస్ అధికారులు, సిబ్బందికి న్యాయ విద్యలో పట్టు కల్పించేలా.. నల్సార్ యూనివర్సిటీతో తెలంగాణ పోలీస్ శాఖ ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో జరిగే అరెస్టులతో 60 శాతం చట్టబద్దత ప్రశ్నార్ధకంగా ఉందని ఫైజన్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఇటీవల కొంతమంది మన పౌరులు కాదనే చర్చ జరుగుతోందని, దీనికి కారణం తమకు ఉన్న 21 రకాల హక్కులపై అవగాహన లోపం వల్లే అని పేర్కొన్నారు. ఈ సదస్సులో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు