టోక్యో ఒలింపిక్స్(TOKYO OLYMPICS)లో తెలుగు తేజం పీవీ సింధు(PV SINDHU) కాంస్య(BRONZE) పతకం సొంతం చేసుకుంది. వరసగా రెండు ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించి సింధు రికార్డు నెలకొల్పింది. రియో ఒలిపింక్స్‌లో రజతం సాధించిన సింధు.. ఈసారి కాంస్యం దక్కించుకుంది. రెండు విశ్వ క్రీడల్లో పతకాలను సాధించిన సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
రికార్డు సింధూరం
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పథకం సాధించిన పీవీ సింధుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(KISHAN REDDY) అభినందనలు తెలిపారు. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పథకాలు సాధించడం దేశానికే గర్వకారణమని కొనియాడారు.
ప్రశంసల జల్లు
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును సీఎం కేసీఆర్(CM KCR) అభినందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. పీవీ సింధును క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్(SRINIVAS GOUD) అభినందించారు. రెండు వరుస పథకాలతో చరిత్ర సృష్టించారని కొనియాడారు.
గర్వకారణం
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకి గవర్నర్ తమిళిసై(TAMILISAI) శుభాకాంక్షలు తెలిపారు. రెండు ఒలింపిక్ పోటీల్లో వరుసగా పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించారని కొనియాడారు. తెలుగు తేజం విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు.