భారత ప్రతినిధులు ఎక్కడికెళ్లినా అత్యున్నత గౌరవం దక్కుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోని యువతను ప్రేరేపించడమే ధ్యేయంగా.. ఇప్పటి వరకు 75 విశ్వవిద్యాలయాలను సందర్శించానని పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమం, నిరుద్యోగ యువతకు శిక్షణ, స్వయం ఉపాధి అంశాలపై దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని, అందులో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నానని 2016లోనే ప్రధానమంత్రి మోదీకి చెప్పానని తెలిపారు. ఆయన 2019లో చూద్దామన్నారని ఇంతలోనే ఉపరాష్ట్రపతి పదవి వరించిందన్నారు. ఇప్పటికి ఆ కోరిక అలానే మిగిలిపోయిందన్నారు. ఈ ఆత్మీయ సత్కారంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఆ ఒక్క కోరిక మిగిలే ఉంది: వెంకయ్య - venkayya naidu speech
ఐక్యరాజ్యసమితి శాంతి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును హైదరాబాద్లో ఘనంగా సన్మానించారు. భారత ప్రతినిధులు ఎక్కడికెళ్లినా అత్యున్నత గౌరవ మర్యాదలు దక్కుతున్నాయన్నారు.
'ఆ ఒక్కకోరిక మాత్రం మిగిలే ఉంది'
Last Updated : Mar 17, 2019, 10:43 PM IST