తెలంగాణ

telangana

ETV Bharat / state

చలి చంపేస్తోంది... నవంబర్​లోనే వణికిస్తోంది! - Winter session start in telangana

రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. శీతాకాలం ప్రారంభంలోనే చలి విజృంభిస్తోంది. తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటని ప్రజలు జంకుతున్నారు. జిల్లాలతో పాటు భాగ్యనగరంలోనూ చలి తీవ్రత అధికంగా ఉంటోంది.

winter-session-starts-in-telangana

By

Published : Nov 19, 2019, 5:53 AM IST

Updated : Nov 19, 2019, 7:36 AM IST

పంజా విసురుతోన్న చలి

శీతాకాలం ప్రారంభంలోనే చలి పంజా విసురుతోంది. డిసెంబర్ మూడోవారం‌, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అధికంగా ఉండాల్సిన చలి నవంబర్‌లోనే తీవ్రంగా నమోదవుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. రాత్రి, తెల్లవారుజాము సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోను చలి ప్రభావం ఎక్కువగా ఉంది.

ఉదయం వేళల్లో నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రతల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. చలి వల్ల యాచకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో బర్త్‌డే పార్టీలతో కిటకిటలాడే నెక్లెస్‌ రోడ్‌, ట్యాంక్‌ బండ్‌ ప్రాంతాలు చలి ప్రభావంతో జనాలు రాక బోసిపోతున్నాయి. చలి భయానికి ప్రజలు బయటకు రాకపోవడం చిరు వ్యాపారులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. జనాలు లేక నగరంలోని రహాదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'ఉద్యోగం కోసం గడప దాటినప్పుడే భవిష్యత్తు బాగుపడుతుంది'

Last Updated : Nov 19, 2019, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details