ప్రతి రెండేళ్లకోసారి కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిక్కీ సంయుక్తంగా వింగ్స్ ఇండియాను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈసారి నాలుగు రోజులపాటు కొనసాగిన ఏవియేషన్ షో ఆదివారంతో ముగిసింది. కరోనా వైరస్ ప్రభావంతో అతికొద్ది మంది వీక్షకులను పరిమిత సమయంలోనే అనుమతించారు. ఇది కొంచెం వీక్షకులను నిరుత్సాహపరిచింది. స్టాళ్లు ఏవియేషన్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు, వాటి విడిభాగాల ప్రదర్శనలు ఆకట్టున్నాయి.
ఆకట్టుకున్న విన్యాసాలు
మొదటి మూడు రోజులు హోండా ఎన్271బీబీ, ధ్రువ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ హెలికాప్టర్, డీఓ–228, ప్రాఫిట్ హంటర్, ఎయిర్ ఇండియా, జీబీఎల్ హెలికాప్టర్, ప్రాఫిట్ హంటర్ ఈ195–ఈ2 హెలికాప్టర్లు, హోండాజెట్, స్పైస్ జెట్‌లను ప్రదర్శనలో ఉంచారు. చివరి రోజు ఐదు చాపర్లు, విమానాలను మాత్రమే అందుబాటులో ఉంచారు. మూడవ రోజు విస్తారా విమానం ఆకట్టుకుంది. గత ఏవియేషన్‌తో పోల్చితే ఈసారి విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.