మెట్టుగూడ డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెరాస అభ్యర్థి సునీత హామీ ఇచ్చారు. వరద బాధితులు అందరికీ పరిహారం వచ్చే విధంగా కృషిచేస్తానన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. తనకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.
అందరికీ వరద సాయం అందేలా కృషిచేస్తా: సునీత - telangana politics
వరద బాధితులందరికీ పరిహారం అందేలా ప్రయత్నం చేస్తానని మెట్టుగూడ డివిజన్ తెరాస అభ్యర్థి సునీత హామీ ఇచ్చారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
అందరికీ వరద సాయం అందేలా కృషిచేస్తా: సునీత
తమ డివిజన్లో డ్రైనేజీ సమస్య ఉందని.. పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు సునీత తెలిపారు. భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీచూడండి:జోరుగా ఓటుకు నోటు డిమాండ్.. బల్దియా ఎన్నికల్లో న్యూ ట్రెండ్