పార్లమెంట్‌కే వెళ్తాడో, జైలుకే వెళ్తాడో తెలియని వ్యక్తికి ఓటేసి తమ ఓటుని వృథా చేసుకోవద్దని తెరాస నేత శశాంక్ అన్నారు. ప్రశ్నించే గొంతుక పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేసులు ఉన్న వ్యక్తిని పార్లమెంట్‌కు పంపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వినూత్న ప్రచారాలను చేస్తూ మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి ఓటుకు నోటు కేసును ఎండగడుతున్నారు.
రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఆదేశాల మేరకు స్టీఫెన్సన్ వద్దకు వెళ్లి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు ప్రదర్శించారు. ప్రజల వద్దకు మొహనికి మారు వేశాలు తగిలించుకుని ప్రదర్శించారు.
ఎన్నికల ప్రచారంలో ఓటుకు నోటు కేసు..!
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి ఓటుకు నోటు కేసును తెరాస నేతలు దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుక పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
వినూత్న ప్రచారాలను చేసిన స్థానిక తెరాస నాయకులు
ఇవీ చూడండి : నరేంద్ర మోదీని ఇంటికి పంపాలి: భట్టి విక్రమార్క