తెలంగాణ

telangana

ETV Bharat / state

సికింద్రాబాద్ కంటోన్మెంట్​ ఉపఎన్నిక జరిగేనా..? - సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికపై చర్చ

secunderabad cantonment by election 2023: రాష్ట్రంలో ఏదైనా నియోజక వర్గంలో ఎమ్మెల్యే/ ఎంపీ రాజీనామా చేసినా.. మృతి చెందినా.. 6 నెలలు లోపు ఉప ఎన్నిక నిర్వహించాలి. అయితే నాలుగు రోజులు క్రితం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఆ స్థానంలో ఉపఎన్నిక నిర్వహణపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

Discussion on Secunderabad Cantonment byelection
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక పై చర్చ

By

Published : Feb 22, 2023, 10:57 AM IST

secunderabad cantonment by election 2023 : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ నియోజక వర్గం ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక వస్తుందా? రాదా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాజనీతిశాస్త్ర నిపుణుడు బీ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ఎంపీ/ఎమ్మెల్యే చనిపోయినా లేదా రాజీనామా చేసినా ప్రజాప్రాతినిధ్య చట్టం 151ఏ ప్రకారం ఆరు నెలల్లోపు ఆ నియోజక వర్గంలో ఉప ఎన్నిక నిర్వహించాలి. దీని ప్రకారం ఆగస్టు 20లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.

మే నెల కంటే ముందే కంటోన్మెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక రావాలి. కానీ, తెలంగాణ శాసనసభ గడువు ఈ ఏడాది డిసెంబరుతో అయిపోతుంది. అంటే గడువు మరో పది నెలలే ఉంది. లోక్‌సభ/శాసనసభ గడువు సంవత్సరంలోపు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి.. ఎన్నికలు నిర్వహించడం కష్టమని ధ్రువీకరిస్తుంది.

ఇదే కారణంతో 2018లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 5 వైఎస్సార్​సీపీ ఎంపీలు రాజీనామా చేసినా.. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించలేదని కొంత మంది రాజకీయ పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. దీని ప్రకారం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని బీ కృష్ణారెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే మృతి:సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న(72) ఈ నెల 19న మృతి చెందారు. ఆయన కొంత కాలంగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ.. 16న యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనను ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. పరిస్థితి విషమించినందున చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యేని బతికించడానికి చాలా ప్రయత్నాలు చేశామని.. కార్డియాక్​ అరెస్ట్ రావడంతో గుండె పనితీరు ఆగిపోయింది వైద్యులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details