తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణమున్నంత వరకు మోదీని వ్యతిరేకిస్తా : ఓవైసీ - ప్రాణమున్నంత వరకు మోదీని వ్యతిరేకిస్తా : ఓవైసీ

ఆదిలాబాద్ జిల్లాలో ఎంఐఎం పార్టీ పుర ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రాణం ఉన్నంత వరకు మోదీని వ్యతిరేకిస్తానని వెల్లడించారు.

ఆదిలాబాద్ పుర ప్రచార పర్వంలో ఓవైసీ
ఆదిలాబాద్ పుర ప్రచార పర్వంలో ఓవైసీ

By

Published : Jan 17, 2020, 1:14 PM IST

గొంతులో ప్రాణమున్నంత వరకు ప్రధాని మోదీని విమర్శిస్తూనే ఉంటానని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు. ఎంఐఎం ముస్లింల పార్టీ కాదని... అన్ని వర్గాలకు చెందిన పార్టీ అని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని డైట్‌ మైదానంలో జరిగిన పుర ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఓవైసీ ఎంఐఎం పార్టీకే ఓటేయాలని కోరారు.

పుర ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను భారీ ఆధిక్యతతో గెలిపించి... పతంగుల పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సభలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మెహరాజ్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫారుఖ్‌ అహ్మద్‌ హాజరయ్యారు. కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

ఆదిలాబాద్ పుర ప్రచార పర్వంలో ఓవైసీ

ఇవీ చూడండి : బస్తీమే సవాల్: దుండిగల్​లో దండిగా ఓట్లు పడేది ఏ పార్టీకి...?

For All Latest Updates

TAGGED:

MIM_MP_ASAD

ABOUT THE AUTHOR

...view details