ఈనెల 9 నుంచి వర్క్ టూ రూల్ పాటిస్తామని తహసీల్దార్ల సంఘం నేతలు వెల్లడించారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పలు జిల్లాలకు బదిలీ చేసిన తహసీల్దార్లను పూర్వపు జిల్లాలకు పంపించాలని డిమాండ్ చేశారు. సీసీఎల్ఏలోని టీజీటీఏ కార్యాలయంలో తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.
ఈ నెల 9 నుంచి 12 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో మాత్రం నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. 15 న రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక సెలవులకు వెళ్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే 16 న మళ్లీ సమావేశమై భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
'బదిలీలు చేపట్టకుంటే సామూహిక సెలవులకెళ్తాం'
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా అంతర్ జిల్లాలకు బదిలీ చేసిన తహసీల్దార్లను పూర్వ జిల్లాలకు పంపాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై రేపు సీఎస్‌కు నోటీసు అందిస్తామని పేర్కొన్నారు.
16న మళ్లీ సమావేశమై భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తాం : తహసీల్దార్ల సంఘం
ఇవీ చూడండి : ఇది ప్రజాధన దుర్వినియోగమే : ఉత్తమ్
Last Updated : Jul 7, 2019, 6:20 PM IST