జూబ్లీహిల్స్ డివిజన్‌లో తనకు అవకాశమిస్తే.. ఎంతో కాలంగా వేధిస్తోన్న సమస్యలను పరిష్కరిస్తానని భాజపా అభ్యర్థి వెల్డండ వెంకటేశ్ హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, మంచినీటి సమస్యలను పరిష్కరిస్తానన్నారు.
రెండు పడక గదుల ఇళ్ల కోసం కొట్లాడుతా: వెల్డండ వెంకటేశ్ - jublihills bjp candidate name
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని జూబ్లీహిల్స్ భాజపా అభ్యర్థి వెల్డండ వెంకటేశ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎప్పటి నుంచో పరిష్కారం కానీ సమస్యలకు చెక్ పెడతానని హామీ ఇచ్చారు.
రెండు పడక గదుల ఇళ్ల కోసం కొట్లాడుతా: వెల్డండ వెంకటేశ్
డివిజన్‌లో అద్దెకుంటున్న 20వేల కుటుంబాల్లో.. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ప్రభుత్వంతో కొట్లాడతానని స్పష్టం చేశారు. కమలం గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.