తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారుల్లో కంటి క్యాన్సర్​పై అవగాహనకు వైట్​థాన్​ - వైట్​థాన్​

చిన్నారుల్లో అరుదుగా వచ్చే కంటి క్యాన్సర్​పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్​ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో వైట్​థాన్​ పేరుతో పరుగు నిర్వహించారు. కార్యక్రమాన్ని గవర్నర్​ నరసింహన్​ దంపతులు ప్రారంభించారు. సేవ్​ విజన్​... సేవ్​ లైఫ్​ నినాదాలతో నగర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కంటి క్యాన్సర్​పై అవగాహన

By

Published : May 19, 2019, 1:05 PM IST

పిల్లల్లో కంటి క్యాన్సర్​పై అవగాహన పరుగు

చిన్న పిల్లల్లో వచ్చే కంటి క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు నెక్లెస్ రోడ్డులో వైట్​థాన్​ పేరుతో పరుగు నిర్వహించారు. ఎల్వీ ప్రసాద్​ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రారంభించారు. సేవ్​ విజన్​... సేవ్​ లైఫ్​ నినాదాలు చేస్తూ ఔత్సాహికులు పరుగెత్తారు. దీని ద్వారా నిధులు సమీకరించి... కంటి క్యాన్సర్​ బారిన పడే చిన్నారులకు వైద్యం అందించాలన్నదే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

సమస్య వస్తే వైద్యుల్ని సంప్రదించాలి

చిన్న పిల్లల కళ్లల్లో తెలుపు రంగు, మెల్లకన్ను ఉంటే... క్యాన్సర్​ వచ్చే ప్రమాదముందని ఎల్వీ ప్రసాద్​ కంటి ఆసుపత్రి వైద్యురాలు స్వాతి తెలిపారు. అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వీలైనంత త్వరగా నేత్ర వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు.
పిల్లల్లో కంటి క్యాన్సర్​ పట్ల సరైన సమయంలో అప్రమత్తమైతే ఆధునిక పద్ధతుల ద్వారా దానిని నివారించి ప్రాణాలు కాపాడొచ్చని వైద్య నిపుణులు తెలిపారు.

ఇదీ చూడండి : రంజాన్ ప్రత్యేకం... ఆల్ హాది ఎక్స్​పో

ABOUT THE AUTHOR

...view details