Wife Protest in Front of Husband House at Hyderabad :ప్రభుత్వ ఉద్యోగినని మోసం చేసి పెళ్లి చేసుకొని, గృహ హింసకు(Domestic Violence) పాల్పడిన భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగిన ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధి బాపూజీ నగర్లో చోటుచేసుకుంది. ఈ మేరకు వారాసిగూడ పోలీస్ స్టేషన్లో బాధితురాలు పవిత్ర ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరిగే వరకూ ఇంటి ముందు నుంచి వెళ్లే ప్రసక్తే లేదని తన కూతురుతో కలిసి నిరసనకు దిగింది.
బిడ్డకు జన్మనిస్తూ భార్య మృతి, రైలు పట్టాలపై భర్త ఆత్మహత్య
సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్సీగుట్ట బాపూజీ నగర్లో నివాసం ఉంటున్న మాజీ ప్రభుత్వ ఉద్యోగి రాంచందర్ రావు తనయుడు కార్తిక్ చంద్ర, చంపాపేట్ ఎంఆర్వో(MRO)గా ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి పవిత్రను 2015లో వివాహం చేసుకున్నాడు. తాను కూడా ప్రభుత్వ ఉద్యోగినని నమ్మబలికి తనను పెళ్లి చేసుకున్నాడని పవిత్ర ఆరోపించింది.
నేను కార్తీక్ చంద్ర అనే అతన్ని నవంబర్ 18, 2015లో పెళ్లి చేసుకున్నాను. నేను ప్రభుత్వ ఉద్యోగినిని. అతడు కూడా పెళ్లైన సమయంలో ఆరోగ్య శ్రీలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నానని చెప్పి పెళ్లి చేశారు. కానీ అతడి సహోద్యోగి పట్ల అనుచితంగా వ్యవహరించాడని సర్వీస్ నుంచి తీసేశారు. అనంతరం మా నాన్న పేరు మీద ఉన్న ఆస్తిని నా పేరు మీదకు రాయించుకొని రమ్మని మా అత్తామామలు, ఆడపడుచు, నా భర్త అందరూ నన్ను చాలా హింసించారు. - పవిత్ర, బాధితురాలు