పుట్టింటికి వెళ్లి... తన మెట్టినింటికి వచ్చిన వివాహిత షాక్ గురైంది. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ముషీరాబాద్‌కు చెందిన వీణ, నారాయణగూడకు చెందిన మహేందర్లకు ఏడు సంవత్సరాల కుమార్తె ఉంది.
అసలేం జరిగిందంటే..?

లాక్‌డౌన్‌కు నాలుగురోజుల ముందు బాధిత మహిళ అత్తయ్య బంధువుల ఫంక్షన్ ఉందని... బలవంతంగా తనని పుట్టింటికి పంపించారని వాపోయింది. తిరిగి ఉగాది పండగ ముందురోజు ఇంటికి వచ్చి చూస్తే... తాళం వేసి ఉందని... అప్పటి నుంచి తన భర్త, అత్తయ్య ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదని ఆవేదన చెందింది. అదేరోజు నారాయణగూడ పోలీసులకు చెబితే.. బలవంతంగా మళ్లీ ముషీరాబాద్‌లోని పుట్టింటికి పంపించేశారని.. తనకు న్యాయం చేయాలని కోరింది. ఎలాగైనా తన అత్తయ్యను, భర్తను వెతికి పెట్టాలని పోలీసులను వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: నాన్న కోసం సైనికుడై.. దేశం కోసం అమరుడై..