తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఫేస్​బుక్'​లో భార్య ఫొటోలు ... భర్త తీవ్ర 'స్పందన' - guntur spandana programme Facebook issue

తన భార్య ఫొటోలు ఫేస్​బుక్​లో పెట్టి బెదిరిస్తున్నారంటూ... స్పందన కార్యక్రమాన్ని ఆశ్రయించాడు ఓ భర్త. అనుమానితుల వివరాలు అందించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన వివరాలివి..!

ఫేస్​బుక్'​లో భార్య ఫొటోలు ...

By

Published : Oct 29, 2019, 2:28 PM IST

తన భార్య ఫోటోలు ఫేస్​బుక్​లో పెట్టి బెదిరిస్తున్నారంటూ ఓ వ్యక్తి గుంటూరు స్పందన కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశాడు. ఓ యువకుడు కొంతకాలంగా తన భార్యకు ఫోన్​ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని... అతన్ని మందలించినందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని వాపోయాడు. తనకు ఓ ముగ్గురిపై అనుమానంగా ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన డీఎస్పీ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details