ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డిని గృహనిర్బంధించిన పోలీసులకు ఆయన భార్య ఉమారెడ్డి షాకిచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి ప్రభాకర్‌రెడ్డి భార్య ఉమారెడ్డి వినతిపత్రం సమర్పించారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు ఉమారెడ్డి ప్రయత్నించగా.. కార్యాలయానికి సిబ్బందితో పోలీసులు తాళం వేయించారు.
పోలీసులకు షాక్ ఇచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య - అనంతపురం జిల్లా తాజా వార్తలు
అక్రమ కేసులపై పోరాటానికి సిద్ధమైన జేసీ సోదరుల దీక్షా ప్రయత్నాన్ని భగ్నం చేయాలన్న ఆలోచనతో ఏపీ పోలీసులు ఆ ఇద్దర్నీ గృహనిర్బంధం చేశారు. వాళ్లు బయటకు రాకుండా కట్టడి చేశారు. దీన్ని గమనించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య... పోలీసుల కన్నుగప్పి బయటకు వచ్చి షాకిచ్చారు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా తాళం వేయించారు.
jc
జేసీ ప్రభాకర్‌రెడ్డి దీక్ష చేస్తానన్న ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు... నేతలందర్నీ ఎక్కడికక్కడ నిర్బంధించారు. పెద్దపప్పూరు మండలం జూటూరు ఫామ్‌హౌస్‌లో జేసీ దివాకర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. అనంతపురం నుంచి తాడిపత్రి వరకు అన్నిచోట్లా భారీగా బలగాలను మోహరించారు. తాడిపత్రికి వెళ్లే వాహనాలను పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. తాడిపత్రిలో 144 సెక్షన్ కొనసాగుతోంది.
ఇదీ చదవండి:తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి గృహనిర్బంధం
Last Updated : Jan 4, 2021, 12:40 PM IST