హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్ పరిధిలోని హరిహరపురం కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్య ఉరేసుకుందని... భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అసలేం జరిగిందంటే?
రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న రాఘవేందర్, సౌమ్యలు వనస్థలిపురం హరిహరపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇవాళ ఉదయం భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన భార్య సౌమ్య... బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
దీనిని గమనించిన భర్త రాఘవేందర్... భయాందోళనకు గురై... గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు గది తలుపులు పగులగొట్టి రాఘవేందర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆత్మహత్యాయత్నంకు కుటుంబ కలహాలే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతురాలిది యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌కు చెందినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
'భార్య చనిపోయిందని... భర్త ఆత్మహత్యాయత్నం' ఇదీ చూడండి:హైదరాబాద్‌లో సైబర్ నేరాలకు చెక్ పెట్టే.. జాతీయ స్థాయి సెంటర్