తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్య అనారోగ్యంపై బెంగతో భర్త.. తట్టుకోలేక ఆమె.. రోజు వ్యవధిలోనే - గుండెపోటు వచ్చి మరణించారు

Wife and Husband Died: జీవితాంతం కలిసిమెలిసి ఉంటామని అగ్నిసాక్షిగా వివాహమాడిన ఓ జంట మరణంలో కూడా ఒకరోజు వ్యవధిలో మరణించారు. ఈ సంఘటనను కళ్లారా చూసినవారు వారి దాంపత్య జీవితాన్ని కొనియాడుతున్నారు. ఇలాంటి అరుదైన ఆ జంట దిగంతాలకు వెళ్లడం బాధాకరమని వాపోతున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో జరిగింది.

Wife and Husband Died
భార్య అనారోగ్యంపై బెంగతో భర్త.

By

Published : Dec 16, 2022, 10:52 PM IST

Wife and Husband Died : 45 సంవత్సరాల క్రితం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని చాలా సంతోషంగా గడిపారు. వారిద్దరి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సర్దుకుని వెళ్లేవారు. ఇలా వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న చలపతి నాయుడు, పద్మావతిలు చాలా అన్యోన్యంగా ఉండేవారు. చలపతి నాయుడు బిసెంట్ తియోసాఫికల్ కళాశాలలో గుమాస్తాగా పనిచేసి.. పదవి విరమణ పొందాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించగా.. వివాహాలు చేసి తమ బాధ్యతను తీర్చుకున్నారు.

పద్మావతి గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతుండేది. ఈమె ఆరోగ్యంపై బెంగతో చలపతి నాయుడు తీవ్ర ఉత్కంఠకులోనై గురువారం గుండెపోటు వచ్చి మరణించారు. ఈయన మరణం తట్టుకోలేని పద్మావతి కూడా కృంగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన మరణించిన ఒకరోజు వ్యవధిలోనే ఆమె కూడా మరణించింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మరణించగా,.. శుక్రవారం పద్మావతి మరణించారు. వారి ఆదర్శమైన దాంపత్య జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. కాగా వీరిద్దరి మృతదేహాలకు శుక్రవారం ఒకేరోజు అంత్యక్రియలు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details