సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లి గ్రామంలో తెల్లవారు జామున జరిగిన పెట్రోల్ దాడి ఘటనలో బాధితులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విమల లక్ష్మీరాజ్యం దంపతుల మధ్య గత నాలుగేళ్లుగా విభేదాలు నెలకొన్నాయి. రాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్య విమల... పిల్లలపై కర్కశ భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకునేందుకు వచ్చిన సోదరికి కూడా ఈ ప్రమాదంలో గాయాలవ్వగా... అందరినీ హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పెట్రోల్ దాడి ఘటనలో బాధితులకు గాంధీలో చికిత్స - SIDDIPETA PETROL INCIDENT
దాంపత్య జీవితంలో రేగిన కలతల వల్ల కట్టుకున్న భార్య, పిల్లలపై పెట్రోల్ దాడి ఘటనలో బాధితులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
గత కొన్ని రోజులుగా నిందితుడు పనికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడని విమల సోదరి, సోదరుడు తెలిపారు. భూమికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నందున వీరికి మనస్పర్ధలు ఏర్పడినట్లు వెల్లడించారు. పాత విషయాలను మనసులో పెట్టుకునే అతను ఈ దారుణానికి ఒడిగట్టాడని వారు చెప్పారు. పథకం ప్రకారమే రాత్రి తమపై దాడికి దిగినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : సిద్దిపేట జిల్లాలో దారుణం
Last Updated : Nov 22, 2019, 1:36 PM IST