ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని చెరువుల్లోకి నీరు బాగా వచ్చింది. రాష్ట్రంలోని దాదాపు సగం చెరువులు అలుగు పారుతున్నాయి. మొత్తం 43,870 చెరువులకు గాను 20483 చెరువులు అలుగు పారుతున్నట్లు నీటిపారుదలశాఖ తెలిపింది.
ప్రాజెక్టుల నుంచి చెరువులు నింపడం, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. మరో 12225 చెరువులు 75 శాతం నుంచి వంద శాతం వరకు నిండాయి. వర్షాలు అధికంగా ఉండడంతో గోదావరి పరీవాహక ప్రాంతంలోని చెరువుల్లోకి నీరు ఎక్కువగా వచ్చింది.