తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... మత్తడిపోస్తున్న చెరువులు - తెలంగాణలో విస్తారంగా వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిప్రవహిస్తుండగా.. చెరువులు మత్తడి పోస్తున్నాయి. పలుచోట్ల పంటలు నీట మునిగి.. రైతులకు నష్టం వాటిల్లింది.

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... మత్తడిపోస్తున్న చెరువులు
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... మత్తడిపోస్తున్న చెరువులు

By

Published : Sep 19, 2020, 5:04 AM IST

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో... రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల వాన పడింది. ఎల్బీనగర్, హయత్​నగర్, అబ్దుల్లాపూర్ మెట్, తుర్కయాంజల్‌లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడ ఏరు పొంగి.. కల్వర్టు మీదగా పారుతుండటంతో కొంత సమయం వాహనరాకపోకలు నిలిచిపోయాయి.

జలమయం...

కూకట్‌పల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో 4 రోజులుగా వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. జగిత్యాల గ్రామీణ మండలం కల్లెడలో తాడిచెట్టుపై పిడుగు పడగా... ఇద్దరు గీత కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కురిసిన వర్షానికి... లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు స్తంభించాయి.

పరిశీలన...

నాగర్‌కర్నూల్​లోని వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి పర్యటించారు. తాడూర్ మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. విస్తారంగా వర్షాలు కురవడంతో.. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల సమీపంలో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ 11 గేట్లు పైకి ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో బండర్ పల్లి వాగు పరవళ్లు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌... ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి.. కాసేపు వాగు అందాలను ఆస్వాదించారు.

ఇదీ చూడండి: 'జీవో ఉల్లంఘించిన 55 పాఠశాలలకు షోకాజ్​ నోటీసులు'

ABOUT THE AUTHOR

...view details