ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవా ?: జగ్గారెడ్డి - ఇదేమి రాజ్యమని ప్రశ్నించిన జగ్గారెడ్డి
సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడికి యత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు.
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన జగ్గారెడ్డి అరెస్ట్ జగ్గా
ప్రగతి భవన్‌ను విడతల వారిగా ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రగతి భవన్ వద్దకు రాగా... పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపేందుకే వచ్చామని...ప్రజాస్వామ్య విధానంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం వినకపోవడం పట్ల జగ్గారెడ్డి మండిపడ్డారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం వినే పరిస్థితుల్లో లేదంటే ఇదేమి రాజ్యమని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
Last Updated : Oct 21, 2019, 5:54 PM IST