తెలంగాణ

telangana

ETV Bharat / state

All Party Meeting: 'తెలంగాణ పట్ల కేంద్రానికి ఎందుకు వివక్ష?'

All Party Meeting: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని తెరాస ఎంపీలు ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ఆల్ పార్టీ మీటింగ్‌లో కేకే, నామ నాగేశ్వరరావు లేవనెత్తారు.

All Party Meeting
All Party Meeting

By

Published : Jan 31, 2022, 7:43 PM IST

All Party Meeting: తెలంగాణ పట్ల కేంద్రానికి ఎందుకు వివక్ష అని తెరాస పార్లమెంటరీ పార్టీ నాయకులు కేకే ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ఆల్ పార్టీ మీటింగ్‌లో కేకే, నామ నాగేశ్వరరావు లేవనెత్తారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్కప్రాజెక్టులో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందలేదని ఆరోపించారు. దేశంలో అనేక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని... తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదని వాపోయారు. ఎందుకు తెలంగాణను శత్రువుగా చూస్తున్నారని.. విరోధం ఎందుకు పెంచుకుంటున్నారని కేకే నిలదీశారు.

ఆల్ పార్టీ మీటింగ్

TRS Meeting: పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ, ఐజీఎస్టీ నిధులను రాష్ట్రాలకు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. వరి ధాన్యం సేకరణలో జాతీయ సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాయిల్డ్ రైస్ సమస్య ఒడిశాతో పాటు అనేక రాష్ట్రాలను బాధిస్తోందని... మెజారిటీ ఉందని ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పార్లమెంట్‌ను కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఉదాహరణకు ప్రివిలేజ్ కమిటీని కూడా ఒక అస్త్రంగా చూస్తున్నారన్నారు.

పార్లమెంట్‌ను, కేంద్ర సంస్థలను తాము కించపరచడం లేదన్న వారు... కానీ కేంద్ర ప్రభుత్వం తన అవసరాలకు వీటిని ఉపయోగించవద్దని సూచించారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని తెలిపారు. పెగసెస్ స్పైవేర్ సమస్య జాతీయ భద్రత అంశమని... ఎనిమిదేళ్లు గడుస్తున్న విభజన సమస్యలను పరిష్కరించడం లేదని కేకే, నామ నాగేశ్వరరావు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details