తెలంగాణ

telangana

ETV Bharat / state

సమ్మెపై మంత్రలు కేటీఆర్,హరీశ్ ఎందుకు స్పందించరు : అశ్వత్థామ రెడ్డి - కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామనే అంశం మేనిఫెస్టోలో లేదని

ఆర్టీసీ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు చేపట్టిన పోరాటానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు తీర్చేంత వరకు బాసటగా ఉంటామని స్పష్టం చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేశారా ? అశ్వత్థామ రెడ్డి

By

Published : Oct 12, 2019, 11:21 PM IST

Updated : Oct 12, 2019, 11:40 PM IST

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామనే అంశం ఎన్నికల మేనిఫెస్టోలో లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ పేర్కొనడం విడ్డూరమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మెకు సంఘీభావంగా హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం సదస్సు నిర్వహించింది. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశాన్ని సీఎం మరోసారి గుర్తు చేసుకోవాలని అశ్వత్థామ రెడ్డి సూచించారు.

మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని మినహా ఎవరూ మాట్లాడరేందుకు ??

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మినహా మరెవ్వరూ ఎందుకు మాట్లాడట్లేదని అశ్వత్థామ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, హరీశ్​ రావు, ఇతర మంత్రులు ఎందుకు స్పందించట్లేదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు... సంస్థ పరిరక్షణ కోసం చేపట్టిన సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు. సమ్మె విజయవంతం అయ్యే వరకు బాసటగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేశారా ? అశ్వత్థామ రెడ్డి

ఇవీ చూడండి : 'కార్మికులను తొలగించే హక్కు కేసీఆర్​కు లేదు'

Last Updated : Oct 12, 2019, 11:40 PM IST

ABOUT THE AUTHOR

...view details