పార్లమెంట్ భవన్ ఉండగా.. కేంద్రం నూతన పార్లమెంట్ భవన్ ఎందుకు నిర్మిస్తోందని మత్స్య, పశుసంవర్థ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ప్రజలకు ఒకేచోట పరిపాలన అందాలనే ఉద్దేశంతో సూతన సచివాలయం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పరిపాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పునరుద్ఘాటించారు.
ప్రధాని ప్రశంసలు..