తెలంగాణ

telangana

ఆ రోజు తబ్లిగీలు కలిసింది ఎవరిని..?

By

Published : Apr 5, 2020, 7:37 AM IST

Updated : Apr 5, 2020, 8:16 AM IST

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గతున్న నేపథ్యంలో దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ సదస్సుతో కొవిడ్​-19 బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో వెయ్యికిపైగా హాజరైన వారు ఉండగా, వారిలో ఇప్పటికే వంద మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. ఇదిలా ఉంటే అక్కడ ప్రార్థనలకు హాజరై తిరిగి వచ్చిన వారిలో ఇప్పటికీ కొంతమంది ఆచూకీ తెలియకపోవడం భయాందోనకు గురిచేస్తోంది.

who-met-the-tabligees-that-day-in-delhi
ఆ రోజు తబ్లిగీలు కలిసింది ఎవరిని..?

మార్చి 20, శుక్రవారం. ఆరోజున ఏం జరిగింది? ఇప్పుడు పోలీసుల దృష్టి అంతా దానిపైనే ఉంది. దిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సదస్సు నుంచి తిరిగి వచ్చాక పలువురు తబ్లిగీలు మర్కజ్‌ విశేషాల గురించి వివరించేందుకు ఆరోజున ప్రార్థనాస్థలాలకు వెళ్లడం కీలకంగా మారింది. ఆ సమయంలో వారు ఎవరెవరిని కలిశారు..? వారిలో వృద్ధులెవరు..? అని ఆరా తీస్తున్నారు.

సహకరించకపోవడం వల్ల..

రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న వారికి కరోనా సోకితే ఆ లక్షణాలు బహిర్గతం కాకున్నా వారి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలుండటం వల్ల పోలీస్‌శాఖ అటు వైపు దృష్టి సారించింది. తబ్లిగీల నుంచి ఇలాంటి పరిస్థితుల్లోనే వారి కుటుంబ సభ్యులతోపాటు ఇతరులకూ వైరస్‌ సోకే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. మరోవైపు పలువురు ఈ విషయాల గురించి చెప్పేందుకు సహకరించకపోవడం వల్ల ఇప్పటికే స్వాధీనం చేసుకున్న వారి సెల్‌ఫోన్లను విశ్లేషిస్తున్నారు. కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

బిహారీ యువకుల నుంచే మహిళకు కరోనా?

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం, రంగారెడ్డి జిల్లాలో ఒక మహిళ మరణంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బిహారీ యువకులు ఆమె ఇంట్లోనే అద్దెకుండటం వల్ల వారి నుంచే ఆమెకు కరోనా సోకి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తబ్లిగీ జమాత్‌ కార్యకర్తలు తిరిగి వచ్చిన రైలులోనే ఈ బిహారీ యువకులు రావడం.. వారిలో కరోనా లక్షణాలు బయటపడకపోయినా వారి నుంచి మహిళకు సోకిందన్న అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

2.20 లక్షల మంది ప్రయాణికులు

దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ సదస్సుకు హాజరై తిరిగి వచ్చిన వారిలో ఇప్పటికీ కొంతమంది ఆచూకీ తెలియకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వారిని పూర్తిస్థాయిలో గుర్తించేందుకు తెలుగు రాష్ట్రాల పోలీసులు, రెవెన్యూ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా దక్షిణ మధ్య రైల్వే ఇచ్చిన ప్రయాణికుల జాబితా కీలకంగా మారింది.

క్రిస్‌ అధికారులు రంగంలోకి..

దిల్లీలో మర్కజ్‌ సదస్సు మార్చి 13 నుంచి 15 వరకు జరిగింది. ఈ నేపథ్యంలో మార్చి 11 నుంచి 23 వరకు దిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమైన అన్ని రైళ్ల సమాచారం కావాలని దక్షిణ మధ్య రైల్వే శాఖను తెలుగు రాష్ట్రాల అధికారులు కోరారు. సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (క్రిస్‌)అధికారులు ఆ తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రయాణించిన 2.20 లక్షల మంది పేర్లు, సెల్‌ నంబర్‌, చిరునామాలను ఇచ్చారు. తెలంగాణ, ఏపీ స్టేషన్లలో దిగిన ప్రయాణికుల వివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు. ముంబయి, పుణె, నాగ్‌పుర్‌ తదితర స్టేషన్లలో దిగిన ప్రయాణికుల సమాచారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా రైల్వేశాఖ అందించిన జాబితా ఆధారంగా ఇప్పటివరకు క్వారంటైన్‌లోకి వెళ్లని వారిని గుర్తించే పనిని ముమ్మరం చేసినట్లు తెలంగాణ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి :నేటి రాత్రి లైట్లు మాత్రమే ఆపాలి: సీఎండీ

Last Updated : Apr 5, 2020, 8:16 AM IST

ABOUT THE AUTHOR

...view details