Who is Hyderabad New CP : రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే.వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని.. అందుకు గానూ పలువురి పేర్లను ప్రతిపాదించి పంపాలని సీఈసీ రాష్ట్ర సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి 17 మందితో కూడిన జాబితాను పంపినట్లు సమాచారం.
Hyderabad New CP :బదిలీ అయిన స్థానాల్లో ఎవరిని నియమిస్తారనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సీపీగా ఎవరు వస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఆ స్థానంలో నియమించేందుకు పలువురు పేర్లలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారినే హైదరాబాద్ సీపీగా నియమించేందుకు ఎన్నికల కమిషన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముగ్గురు అధికారుల పేర్లు పరిశీలనలోకి రాగా అందులో ఇద్దరు మాత్రం ఉత్తర భారతానికి చెందినవారు కావడంతో వారిలో ఒకరిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
EC Transfers 20 Officers In Telangana: తెలంగాణ పోలీసు అకాడమీ సంచాలకులుగా పనిచేస్తున్న సందీప్ శాండిల్య, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్‌లకు ఎక్కవగా అవకాశాలు ఉన్నాయి. వారు కాకుండా చాలా కాలంగా ప్రాధాన్యత సంతరించుకోలేని పోస్టుల్లో ఉద్యోగం చేస్తున్న కొత్తకోట శ్రీనివాస రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ముక్కుసూటి అధికారిగా పేరు పొందిన శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం అదనపు డీజీగా పనిచేస్తున్నారు. మహేశ్ భగవత్‌కు అవకాశం లభించవచ్చని ప్రచారం జరిగినప్పటికీ మునుగోడు ఉపఎన్నికలు జరిగినప్పుడు ఆయన రాచకొండ కమిషనర్‌గా పనిచేశారు. చౌటుప్పల్ రాచకొండ పరిధిలోకి రావడం ఇప్పుడు ఆయన నియామకానికి ఆటంకంగా మారింది.
Officers Transfers in Telangana 2023 : త్వరలోనే ఆ 100 మంది అధికారుల బదిలీ..!