తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​ నుంచి బరిలో నిలిచేదెవరో.. ? - కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి

హుజూర్​నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడింది. తెరాస తమ అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సతీమణి పద్మాతిని బరిలోకి దిగడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అలాగే హస్తం పార్టీలో మరొక అభ్యర్థిగా చామల కిరణ్​ కుమార్​ రెడ్డిని రేవంత్​ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు. దీనితో హుజూర్​ నగర్ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగనుంది. ​

కాంగ్రెస్​ నుంచి బరిలో నిలిచేదెవరో.. ?

By

Published : Sep 22, 2019, 5:11 AM IST

Updated : Sep 22, 2019, 7:29 AM IST

కాంగ్రెస్​ నుంచి బరిలో నిలిచేదెవరో.. ?

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కాంగ్రెస్​ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీ చేసే అవకాశం ఉండగా.. తెరాస గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సైదిరెడ్డిని మరోసారి అభ్యర్థిగా కేసీఆర్​ నిర్ణయించారు.

కాంగ్రెస్​లో భిన్నాభిప్రాయాలు:

కాంగ్రెస్​కు ఈ ఉపఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. 1999, 2004లో కోదాడ నుంచి గెలుపొందిన ఉత్తమ్​.. హుజూర్​నగర్​ నియోజకవర్గం ఏర్పడ్డాక 2009, 2014, 2018 శాసన సభ ఎన్నికల్లో వరుసగా జయకేతనం ఎగురవేశారు. గత లోక్​సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసినపుడు కూడా హుజూర్​నగర్​ శాసనసభ స్థానంలో ఉత్తమ్​కే ఆధిక్యం లభించింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్​.. పార్టీ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఆయన సతీమణి పద్మావతి హుజూర్​నగర్​ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఆమెకు కూడా నియోజకవర్గంలో విస్తృత పరిచయాలున్నాయి. కాంగ్రెస్​​ నాయకుల్లో భిన్నాభిప్రాయలు.. ఈ ఎన్నికపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.

ఉత్తమ్​కు అండగా..

హుజూర్​నగర్​కు సంబంధం లేని చామల కిరణ్​ కుమార్​ రెడ్డి పేరును ఎంపీ రేవంత్​ రెడ్డి ప్రతిపాదించడమే కాక పద్మావతి అభ్యర్థిత్వాన్ని చర్చించకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన హస్తం నాయుకులు ఉత్తమ్​కు అండగా నిలబడినా ఆచరణలో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.

ఇవీ చూడండి: దిల్లీలో ఎన్డీఏ ముఖ్యనేతల సమావేశం

Last Updated : Sep 22, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details