ఎవరిచ్చారు? - sit
"డేటా ఎక్కడి నుంచి వచ్చింది... ఎవరిచ్చారు... ఎందుకోసం వాడుతున్నారు... సమాచారం దుర్వినియోగం చేస్తున్నారా... అనే కోణంలో సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా ఐటీ గ్రిడ్స్ కేసు దర్యాప్తు చేసి... వీలైనంత త్వరగా కోర్టులో నివేదిక సమర్పిస్తాం." - స్టీఫెన్ రవీంద్ర
![ఎవరిచ్చారు?](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2632414-634-3a73a72d-3b2a-4b64-b3c3-490bbdd7e4ea.jpg)
నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం
ఐటీ గ్రిడ్స్ సంస్థ సమాచారం దుర్వినియోగం చేసిందని నమోదైన కేసు విచారణలో వేగం పుంజుకుంది. 9మంది అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈరోజు పని ప్రారంభించింది. శాస్త్రీయ పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానంతో..నిష్పక్షపాతంగా విచారించి, కోర్టుకు నివేదిక సమర్పిస్తామని సిట్ అధిపతి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎవరైనా తమ డేటాకు నష్టం జరిగినట్లు తెలిస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. సంస్థ ఎండీ అశోక్‌ను పట్టుకొని, కేసు పురోగతి మేరకు ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామన్నారు.
నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం