తెలంగాణ

telangana

By

Published : Jan 9, 2020, 5:33 AM IST

Updated : Jan 9, 2020, 8:29 AM IST

ETV Bharat / state

రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతులెందరు?

రుణమాఫీ అమలుదిశగా  రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అర్హులైన రైతులు ఎందరో లెక్కతేల్చాలని బ్యాంకర్లను కోరింది. లక్ష రూపాయల వరకూ రుణమాఫీ చేస్తే... ఎన్ని నిధులు అవసరమవుతాయో తెలపాలని సర్కారు ఆదేశించింది.

who-are-the-eligible-farmers-in-the-telanagana-state
రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతులెందరు?

ఏడాది కాలంగా కర్షకులు ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకం అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2018 డిసెంబరు 11 లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. రుణమాఫీకి ఎంతమంది రైతులు అర్హులో లెక్కలు తేల్చేందుకు సర్కారు సిద్ధమైంది.

రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతులెందరు?

35 లక్షల రైతు కుటుంబాలు

రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య, ఇందుకు చెల్లించాల్సిన నిధులెన్ని అనే వివరాలు సమగ్రంగా ఇవ్వాలని ఎస్​ఎల్​బీసీని సర్కారు ఆదేశించింది. పీఎం కిసాన్ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తున్న వివరాల ఆధారంగా... రాష్ట్రంలో దాదాపుగా 35లక్షల రైతు కుటుంబాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించింది. కుటుంబంలో ఒకరికే మాఫీ చేయాలా... లేదా... అందరికీ ఇవ్వాలా అనేది సీఎం నిర్ణయించనున్నారు. కుటుంబానికి ఒకరికే అనే ప్రాతిపదిక తీసుకుంటే నిర్థేశిత గడువు తేదీ నాటికి 28వేల కోట్ల రూపాయల వరకూ బకాయిలు ఉండవచ్చని ప్రాధమిక అంచనా. ప్రతి ఒక్కరికీ చెల్లించాలంటే నిధులు 32 వేల కోట్ల రూపాయలు దాటవచ్చని భావిస్తున్నారు.

4 విడతలుగా...

గతంలో మాదిరిగా మొత్తం నాలుగేళ్లపాటు 4విడతలుగానే రుణా మాఫీ డబ్బులు అందే అవకాశాలు ఉన్నాయి. కొత్త బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించాలని వ్యవసాయ శాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కాగా... రుణమాఫీ పథకం కింద సొమ్ము బ్యాంకుల్లో నేరుగా జమ సేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. గతంలో బ్యాంకులు రైతులను ఇబ్బందులకు గురిచేశారని భావిస్తున్న ప్రభుత్వం... ఈసారి ప్రతి రైతుకు చెక్కు రూపంలో అందజేసే విషయాన్ని పరిశీలిస్తోంది.

మాఫీ చేస్తారా?

గత అక్టోబరు 1 నుంచి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రైతులు తీసుకున్న రుణాలను వ్యవసాయ పంట రుణాల జాబితాలో చూపవద్దని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. కానీ, రుణమాఫీ పథకం 2018 డిసెంబరు 11 నాటికి ఉన్న బకాయిలకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలియజేసింది. అప్పటికీ బంగారం తాకట్టు రుణాలు.. పంట రుణాల జాబితాలోనే ఉన్నాయి. వాటిని ఇప్పటి నిబంధనల ఆసరాగా జాబితా నుంచి తొలగిస్తారా... లేక మాఫీ చేస్తారా... అనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుంది.

ఇవీచూడండి: పురపోరుకు ములుగు ఎందుకు దూరమైంది..?

Last Updated : Jan 9, 2020, 8:29 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details