విద్యుత్‌రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల- అధికార విపక్షాల మధ్య "పవర్" వార్ White Paper on Electricity Debts :శాసనసభలో ఇంధన రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం స్వల్పకాలిక చర్చను చేపట్టిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(bhatti vikramarka) రాష్ట్రంలో విద్యుత్‌రంగం పరిస్థితుల్ని వివరించారు. గత ప్రభుత్వ నిరర్ధక అప్పులు, విధానాలతో విద్యుత్ రంగం కుదేలయిందన్నారు. అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట, గజ్వేల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి : సీఎం రేవంత్ రెడ్డి
Today Assembly Discussions on Power Debts : గత ప్రభుత్వ విధానాల వల్ల డిస్కంల అప్పులు 81 వేల 516 కోట్ల రూపాయలకు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలన సక్రమంగా, ప్రణాళికబద్ధంగా లేకపోవడం వల్ల డిస్కంల లోటు 62 వేల 496 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. వ్యవసాయ రాయితీ అంతరం 18 వేల 725 కోట్ల రూపాయలుగా ఉందన్నారు.
"గత ప్రభుత్వ నిరర్ధక అప్పులు, విధానాలతో విద్యుత్ రంగం కుదేలయింది. గత ప్రభుత్వ విధానాల వల్ల డిస్కంల అప్పులు 81 వేల 516 కోట్ల రూపాయలకు చేరాయి. గత ప్రభుత్వ పాలన సక్రమంగా, ప్రణాళికబద్ధంగా లేకపోవడం వల్ల డిస్కంల లోటు 62 వేల 496 కోట్ల రూపాయలకు చేరింది". - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
Telangana Assembly Sessions 2023 :బీఆర్ఎస్(BRS) సర్కార్ హయాంలో విద్యుత్‌రంగ సంస్థల అప్పులే కాదు ఆస్తులు పెరిగాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము చేపట్టిన విద్యుత్ సంస్కరణల వల్ల కాంగ్రెస్ సర్కార్‌కు ఉచిత విద్యుత్ ఇవ్వడం నల్లేరుపై నడకేనని వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ విధానమేంటో సభలో చెప్పాలని డిమాండ్ చేశారు.
"రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ రంగం సంక్షోభ స్థితిలో ఉంది. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాం. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో విద్యుత్‌రంగ సంస్థల అప్పులే కాదు ఆస్తులు పెరిగాయి. మేము చేపట్టిన విద్యుత్ సంస్కరణల వల్ల కాంగ్రెస్ సర్కార్‌కు ఉచిత విద్యుత్ ఇవ్వడం నల్లేరుపై నడకలా ఉంటుంది". - జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
విద్యుత్ సంస్థల నష్టాలను చూసి భయభ్రాంతులకు గురికావాల్సి వస్తోందని భాజపా ఆందోళన వ్యక్తం చేసింది. శ్వేతపత్రంలో కేంద్రం చేసిన సాయం ప్రస్తావన ఎక్కడా లేదని భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టం చేయాలని శంకర్ డిమాండ్ చేశారు.
అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలకు చాలా వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారన్న ఎంఐఎం సభాపక్షనేత అక్బరుద్దీన్ సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కరించాలని కోరారు. విద్యుత్ అందించే క్రమంలో కేసీఆర్ నిర్ణయాల్లో పొరపాట్ల వల్లే నష్టాలు వచ్చాయన్న సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు విద్యుత్‌రంగంలో నష్టాలు ఎలా పూడ్చుకోవాలో ఆలోచించాలన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో సోలార్ పవర్ వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ సమావేశాలు - జగదీశ్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం