నేటి నుంచి రాష్ట్రంలో రాత్రి 9.30 వరకు మద్యం విక్రయాలు జరుగుతాయని అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 93 ప్రకారం నూతన మార్గదర్శకాలు అమలులో ఉంటాయని వివరించారు. లాక్డౌన్ సమయంలో అక్కడక్కడా అక్రమ మద్యం, గుడుంబా తయారీ మొదలైందని... వారిపై కేసులు నమోదు చేసి నిర్మూలన చేశామన్నారు.
రాత్రి 9.30 వరకు మద్యం విక్రయాలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - liquor shops open till 9.30om in telangana
గురువారం నుంచి రాష్ట్రంలో మద్యం దుకాణాలు రాత్రి 9.30 వరకు తెరిచి ఉంటాయని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న గుడుంబాను అరికడతామని ఆయన స్పష్టం చేశారు.
రాత్రి 9.30 వరకు మద్యం విక్రయాలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
అక్రమ మద్యం వివరాలు తెలిస్తే ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారి వివరాలు గోప్యంగా ఉంచి, తగిన పారితోషకం ఇస్తామని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్