Speaker Tammineni Fell down : కబడ్డీ ఆడుతూ ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అదుపుతప్పి కిందపడిపోయారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్ కళాశాల మైదానంలో ‘సీఎం కప్’ నియోజకవర్గ స్థాయి పోటీలను స్పీకర్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు వారితో కలిసి సరదాగా ఆయన కబడ్డీ ఆడారు. ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోయారు. వెంటనే అక్కడున్న వారు స్పీకర్‌ను పైకిలేపారు. క్రీడల్లో ఇలాంటివి మామూలేనంటూ తిరిగి ఉత్సాహంగా ఆటలో పాల్గొన్నారు.
Speaker Tammineni : కబడ్డీ ఆడుతూ.. పడిపోయిన సభాపతి - స్పీకర్ తమ్మినేని సీతారాం వార్తలు
Speaker Tammineni : క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడారు. అయితే.. ఆట ఆడే క్రమంలో అదుపు తప్పడంతో.. కింద పడిపోయారు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్ కళాశాల మైదానంలో జరిగింది.
Speaker Tammineni