తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాహుల్​ సిప్లిగంజ్​పై దాడి చేసిన వారిపై చర్యలేవీ?' - BC Leader R.Krishnayya Latest News

బిగ్‌బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌పై దాడి చేసిన వారిపై చర్యలేవని ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య ప్రశ్నించారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

R. Krishnayya
R. Krishnayya

By

Published : Mar 20, 2020, 11:31 PM IST

రాష్ట్రంలో బలహీనవర్గాలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. బిగ్‌బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌పై బహిరంగంగా దాడి చేసిన రంజిత్​రెడ్డిపై... ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజానీకం పరిస్థితేంటని ప్రశ్నించారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోకపోతే జాతీయ బీసీ కమిషన్‌, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. బలహీన వర్గాలపై దాడులు అరికట్టేందుకు జాతీయ స్థాయిలో చట్టాన్ని తేవాలని ఆయన డిమాండ్​ చేశారు.

'రాహుల్​ సిప్లిగంజ్​పై దాడి చేసిన వారిపై చర్యలేవీ?'

ఇదీ చూడండి:జర భద్రం.. జోలికొస్తే మట్టి కరిపిస్తాం..!

ABOUT THE AUTHOR

...view details