హైదరాబాద్ శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన మర్రి చెన్నారెడ్డి శతజయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెన్నారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మర్రి చెన్నారెడ్డి స్మారక అవార్డుకు విశ్రాంత చీఫ్ ఇంజినీర్ టి.హనుమంతరావును ఎంపిక కమిటీ ప్రతిపాదించింది. ఆ అవార్డును హనుమంతరావు కుమారుడు విజయ్‌కుమార్‌కు వెంకయ్యనాయుడు అందజేశారు.
'ఎన్ని విమర్శలు చేసినా ఓపికగా వినేవారు' - ఎంత గట్టిగా విమర్శలు చేసినా ఓపికగా వినేవారు ఉపరాష్ట్రపతి
చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నానని, ఎన్ని విమర్శలు చేసినా ఓపికగా వినేవారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మర్రిచెన్నారెడ్డి శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్ పేరుతో విజయవాడ నుంచి నిజాంకి వ్యతిరేకంగా పత్రిక నడిపిన వ్యక్తి చెన్నారెడ్డి అని కొనియాడారు. చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నానని, ఎంత గట్టిగా విమర్శలు చేసినా ఓపికగా వినేవారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చెన్నారెడ్డి నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ రోశయ్య, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కుంతియా, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పంప్‌హౌస్ పక్కగోడకు పగుళ్లు.. అప్రమత్తమైన అధికారులు