తెలంగాణ

telangana

ETV Bharat / state

పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే.. ఇలా సన్నద్ధమవ్వండి! - తెలంగాణ గ్రూప్​4 నోటిఫికేషన్​

How to get Telangana Group 4 Job: డిగ్రీ పాసయ్యాక.. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కోచింగ్​ సెంటర్​లలో చేరుతారు. అయితే చేరినంత మాత్రం ఉద్యోగం వస్తుందనుకుంటే పొరపాటే.. ఎందుకంటే అందుకు తగ్గట్టు ప్రణాళిక ప్రకారం చదివితేనే లక్షల్లో రాసే ఈ పోటీ పరీక్షల్లో ఉద్యోగం సాధించగలం.. అయితే డిగ్రీ పాస్​ అయిన తరువాత ఏం చేయాలి.. పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం..

telangana group4
గ్రూప్​4 సన్నద్ధం

By

Published : Jan 10, 2023, 11:54 AM IST

How to get Telangana Group 4 Job: డిగ్రీ పాసయ్యాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా లక్ష్యం. గ్రూప్‌-4కు ఎలా సన్నద్ధం కావాలని కెరియర్​ కౌన్సెలర్​ బెల్లంకొండ రాజశేఖర్​ను బి. వందన అనే విద్యార్థి తన సందేహాన్ని అడిగింది? అందుకు సమాధానంగా ఆయన ఈ కింది జవాబు ఇచ్చారు.

జవాబు: పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్స్‌ ఉద్యోగాలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. ఇంత పోటీని తట్టుకొని ఉద్యోగం సంపాదించాలంటే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం అవ్వాల్సిందే. జనరల్‌ నాలెడ్జ్‌, సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ల్లో.. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ప్రాంతీయ భౌగోళిక, సామాజిక, సంస్కృతి, వారసత్వం, ఆర్ధికం, కళలు, సాహిత్యం, పాలన విధానాలపై అవగాహన ఏర్పర్చుకోవాలి.

దీంతోపాటు భారత రాజ్యాంగం, భారత భౌగోళిక అంశాలు, భారత ఆర్ధిక వ్యవస్థ, భారత జాతీయోద్యమం అంశాలపై కూడా పట్టు సాధించాలి. దైనందిన జీవితంలో సైన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, అంతర్జాతీయ సంబంధాలు, సమకాలీన సంఘటనలపై కూడా ప్రశ్నలుంటాయి. విజయం సాధించాలంటే రోజుకు కనీసం 8 గంటలు చదవాల్సిన అవసరం ఉంది. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి గత సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అంకగణితం లేదా సంఖ్యా సామర్థ్యాలకు సంబంధించిన సూత్రాలను ఒకచోట రాసుకొని, రోజూ ప్రాక్టీస్‌ చేయాలి.

ఏ పోటీ పరీక్షలోనైనా సరైన సమాధానాన్ని ఒక నిమిషంలోపే గుర్తించగలిగే సామర్థ్యం ముఖ్యం. సోషల్‌ మీడియాలో వ్యాపించే నెగెటివ్‌ ప్రచారాలకు దూరంగా ఉండండి. ప్రామాణిక పుస్తకాల నుంచి సమాచారాన్ని సేకరించి మీరే సొంతంగా నోట్స్‌ తయారుచేసుకోండి. మార్కెట్‌లో లేదా సోషల్‌ మీడియాలో దొరికే స్టడీ మెటీరియల్‌ నాణ్యతను పరిశీలించాకే, దానిపై ఆధారపడండి. ప్రశాంతమైన మనసుతో, ఎలాంటి ఆందోళనకూ గురి అవ్వకుండా పరీక్షకు సన్నద్ధమై మీ లక్ష్యాన్ని చేరుకోండని కెరియర్​ కౌన్సెలర్​ రాజశేఖర్​ వివరణ ఇచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details