గతేడాది అఖిల భారత స్థాయి ఎంబీబీఎస్ ప్రవేశాల్లో (MBBS Admissions) కన్వీనర్ కోటాలో ప్రవేశాలు కనిష్ఠంగా ఎస్సీ కేటగిరీలో 1,71,264 ర్యాంకు వద్ద నిలిచిపోయింది. ఓపెన్ విభాగంలో కనిష్ఠంగా జనరల్‌లో 89,011వ ర్యాంకు, మహిళల్లో 87,882వ ర్యాంకు వద్ద సీట్లు (MBBS Admissions) పొందారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా కింద జనరల్‌లో 77,358వ ర్యాంకు, మహిళల్లో 77,228వ ర్యాంకు పొందినవారికి సీట్లు (MBBS Admissions) లభించాయి. 2020-21 వైద్యవిద్య సంవత్సరంలో రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల (MBBS Admissions) ను కన్వీనర్ కోటాలో పొందిన వారి ర్యాంకులను పరిశీలిస్తే ఈ సమాచారం వెల్లడైంది.
2021-22 వైద్యవిద్య సంవత్సరంలో ఎంబీబీఎస్ సీటు (MBBS Admissions) ను పొందడానికి గత నెల(సెప్టెంబరు) 12న విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. త్వరలోనే ఫలితాలు రానున్న నేపథ్యంలో.. ఈ ఏడాది ఏ కేటగిరీలో.. ఏ ర్యాంకు వచ్చిన వారికి సీటు (MBBS Admissions) లభించే అవకాశాలున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే కచ్చితంగా గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అవే ర్యాంకులకు సీటు వచ్చే అవకాశాలు ఉండవనీ, కొంత మేరకు అవగాహనకు ఇది ఉపయోగపడుతుందని కాళోజీ ఆరోగ్యవర్సిటీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్యకళాశాలల్లో కలిపి మొత్తంగా 5,040 ఎంబీబీఎస్ (MBBS Admissions) సీట్లున్నాయి. ఇందులో ప్రభుత్వ వైద్యంలో 1,740 ఉండగా.. వీటిలో అఖిల భారత కోటాలో 467, ఈఎస్‌ఐ నుంచి 50 సీట్లు భర్తీ అవుతాయి. అంటే మొత్తంగా 517 అఖిల భారత కోటాకు రాష్ట్రం నుంచి చేరతాయి.
మిగిలిన ప్రభుత్వ కళాశాలల్లోని వాటిని, ప్రైవేటు కళాశాలల్లోని 50 శాతం సీట్లను కలిపి కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఏపీ విద్యార్థులు తెలంగాణలో, తెలంగాణ విద్యార్థులు ఏపీలో అన్‌రిజర్వుడ్ కోటాలో దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలో నీట్ ర్యాంకులు వెలువడనున్న నేపథ్యంలో.. విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకరరెడ్డి తెలిపారు. ర్యాంకుల వెల్లడికి, ప్రవేశ ప్రకటనకు మధ్య కనీసం రెండు వారాల వ్యవధి ఉంటుందనీ, ఆఖరి నిమిషంలో ధ్రువపత్రాల కోసం పరుగులు పెట్టకుండా ముందుగానే సన్నద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి:MBBS SEATS IN TELANGANA: గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు