ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజల రక్తాన్ని పిండుకోవాలని చూస్తోందని భాజపా రాష్ట్ర నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 6 వేల కోట్ల రూపాయల వసూలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఆయన మండిపడ్డారు. భూ క్రమబద్ధీకరణను తక్షణమే రద్దు చేయాలని శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
అసలే ఇబ్బందులతో..
కరోనా నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వారిపై ఎల్‌ఆర్‌ఎస్ పేరిట మరింత భారం మోపవద్దని కోరారు. తెరాస ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించట్లేదని ఆయన ప్రశ్నించారు.