- అపార్టుమెంట్‌లోని కామన్ ఏరియాను మొత్తం లిసో ప్రొపైల్ ఆల్కాహాల్‌తో ప్రతిరోజు శానిటైజేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా లిఫ్ట్‌లు, స్విచ్‌లు, రెయిలింగ్స్, టేబుళ్లు, డోర్ హ్యాండిళ్లు శుభ్రం చేస్తున్నారు.
- స్ప్రేలు,శానిటైజర్స్, ఫేస్‌మాస్కులను ముందుస్తుగా అపార్టుమెంట్లో నిల్వ ఉంచారు.
- జిమ్, ఈతకొలను, క్లబ్‌హౌజ్‌ను మూసేశారు.
- సామూహిక కార్యక్రమాలు, వేడుకల నిర్వహణను నిషేధించారు.
- స్విగ్గీ, ప్లిప్‌కార్ట్, అమెజాన్ నుంచి వచ్చే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, డెలివరీ బాయ్స్‌ను అపార్టుమెంట్ లోపలికి అనుమతించడం లేదు. పార్సిళ్లను సెక్యూరిటీకి అందజేసి వెళ్లాలి.
- అపార్టుమెంట్ లోపలికి వచ్చే సందర్శకులను పరీక్షించేందుకు నాన్ కాంటాక్ట్ థర్మోమీటర్లు ఉంచారు. ప్రతిఒక్కరిని గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు.
- ప్రతి లిఫ్ట్ వద్ద టూత్‌పిక్‌లను ఉంచారు. లిఫ్ట్ బటన్‌ను టూత్పిక్తోనే నొక్కాలని సూచించారు. వాడిన టూత్‌పిక్‌లను లిఫ్ట్ ఆవరణలో ఉంచిన ట్రాష్బిన్లో మాత్రమే వేయాలి.
- అపార్టుమెంట్లో ఉంటున్నవారు ఎవరైనా విమాన ప్రయాణం చేసి వస్తే 15 రోజులపాటు స్వీయ క్వారంటైన్లో ఉండాలి.
- పనిమనుషులు మాస్కులు ధరించాలి. తరుచూచేతులు కడుక్కునేందుకు సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.
ఈ అపార్టుమెంట్లోకి కరోనా రాకుండా ఏం చేశారో తెలుసా? - కరోనా వైరస్ వార్తలు
కరోనా వైరస్ నివారణకు మాదాపూర్‌లోని జైన్ శ్రీకర్ అపార్టుమెంట్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ అపార్టుమెంట్ వాసులను అప్రమత్తం చేశారు. వైరస్ సోకకుండా చర్యలు చేపట్టారు. వాటి గురించి తెలుసుకుందామా..
ఈ అపార్టుమెంట్లోనికి కరోనా రాకుండా ఏం చేశారంటే...!