ఇంట్లో తెలిసిందని - SOCIAL MEDIA
వారిద్దరు ప్రేమికులు... ప్రేమికుల రోజు సందర్భంగా సరదాగా సిద్దిపేట జిల్లాలోని కోమటిచెరువుకు వెళ్లారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వీరి ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ ప్రేమ జంటను లేక్ పోలీసులు కాపాడారు
ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకోవాలని యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరికి కౌన్సిలింగ్ నిర్వహించి.. సిద్దిపేట పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
Last Updated : Feb 16, 2019, 11:31 AM IST